దుర్మార్గపు పాలనను అంతం చేద్దాం

ABN , First Publish Date - 2022-09-13T05:42:55+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపు పాలనను అంతం చేద్దామని మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ పేర్కొన్నారు.

దుర్మార్గపు పాలనను అంతం చేద్దాం
్ఠదొమ్మలపాటి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన యువకులు

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 12: రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపు పాలనను అంతం చేద్దామని మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాల యం వద్ద పట్టణానికి చెందిన బుగ్గవంక యువకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నా రు. ఈ సందర్భంగా దొమ్మలపాటి మాట్లాడుతూ వైసీపీ పాలన చూసి ప్రజలు విస్తుపోయారని, దీనికి నిదర్శంగా పట్టణంలోని 15వవార్డుకు చెందిన సురేశ్‌, శంకర, ప్రసాద్‌, రామకృష్ణ, మల్లికార్జున, తేజ, హరినాథ్‌ విజయ్‌,రెడ్డిశేఖర్‌ తెలుగు దేశం పార్టీలో చేరారన్నారు. వైసీపీ ఆగడాలను అడ్డుకునే యువతకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే స్పూర్తితో టీడీపీ బలోపేతం చేయాలని యువ తకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దొమ్మలపాటి యశశ్విరాజ్‌, వల్లిగ ట్ల వెంకటరమణ, రవి, విద్యాసాగర్‌, రామిశెట్టి భాస్కర్‌, కాశీరామ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Read more