ఇండసి్ట్రయల్‌ హబ్‌గా కడప జిల్లా

ABN , First Publish Date - 2022-12-13T23:35:43+05:30 IST

కడప జిల్లాను ఇండసి్ట్రయల్‌ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, నగర మేయర్‌ సురే్‌షబాబు పేర్కొన్నారు.

ఇండసి్ట్రయల్‌ హబ్‌గా కడప జిల్లా

కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 13: కడప జిల్లాను ఇండసి్ట్రయల్‌ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, నగర మేయర్‌ సురే్‌షబాబు పేర్కొన్నారు. కడప నగరం వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇది దేశంలోనే రెండో అతి పెద్ద పరిశ్రమగా ఉంటుందన్నారు. జేఎ్‌సడబ్ల్యు రెండో ప్లాంటు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అప్జల్‌ఖాన్‌, డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, నగర అధ్యక్షులు ఎన్‌.సుబ్బారెడ్డి, కార్పొరేటరు పాకా సురేష్‌, షఫి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:35:43+05:30 IST

Read more