-
-
Home » Andhra Pradesh » Kadapa » Laddu worth Rs650 lakhs-MRGS-AndhraPradesh
-
రూ.6.50 లక్షలు పలికిన లడ్డూ
ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST
పులివెందుల పట్టణంలోని మైత్రి లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమ వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదం వేలం పాట రూ.6.50లక్షలకు పలికింది.

పులివెందుల టౌన్, సెప్టెంబరు 8: పులివెందుల పట్టణంలోని మైత్రి లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమ వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదం వేలం పాట రూ.6.50లక్షలకు పలికింది. గురువారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో ఎలక్ర్టికల్ కాంట్రాక్టర్ ఓటికుంట గంగాధర్ నాయుడు రూ.6.50 లక్షలకు పాడి దక్కించుకున్నారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడికి గురువారం నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.