రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ కరువు
ABN , First Publish Date - 2022-08-23T05:05:32+05:30 IST
రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ కరువైందని మైనార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు ఖాదర్‌బాషా అన్నారు.
జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాషా
కమలాపురం రూరల్, ఆగస్టు 22: రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ కరువైందని మైనార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు ఖాదర్‌బాషా అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీన, టీడీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మైనార్టీ దంపతులపై వైసీపీ నాయకులు ఇంటి స్థలం విషయమై మహబూబ్‌బాషా అతని భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారిద్దరూ మరణించారన్నారు. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతోందని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మైనార్టీలపై దాడులు అధికమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలకు రక్షణ కావాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా రావాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు అంకిరెడ్డి, వాసుదేవరెడ్డి, జంపాల నరసింహారెడ్డి, నాగమల్లారెడ్డి, టీఎనటీయూసీ జిల్లా అధికార ప్రతినిధి దేశంరెడ్డి, మజీద్ పాల్గొన్నారు.