రిటైర్డ్ టీచర్ నరసింహారెడ్డిపై కత్తితో దాడి
ABN , First Publish Date - 2022-08-16T05:58:11+05:30 IST
పట్టణంలో రిటైర్డ్ టీచర్ నరసింహారెడ్డిపై రవి అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత నర సింహారెడ్డి సొంతంగా ఓ కుట్టు మిషన్ దుకాణం పెట్టుకుని నడుపుతున్నాడు.

రాజంపేట, ఆగస్టు 15: పట్టణంలో రిటైర్డ్ టీచర్ నరసింహారెడ్డిపై రవి అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత నర సింహారెడ్డి సొంతంగా ఓ కుట్టు మిషన్ దుకాణం పెట్టుకుని నడుపుతున్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల రవి అక్కడికి వెళ్లి కుట్టు మిషన్ దుకాణంలో ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
