కడపలో టీడీపీ నేతల ఆందోళన
ABN , First Publish Date - 2022-03-22T18:08:05+05:30 IST
నగరంలో అన్నాక్యాంటీన్ కూల్చివేతకు నిరసనగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

కడప: నగరంలో అన్నాక్యాంటీన్ కూల్చివేతకు నిరసనగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కడప టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూల్చిన అన్నా క్యాంటీన్‌ను పున:ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. పేదలకు రెండు రూపాయల అన్నం పెట్టే అన్నాక్యాంటీన్‌ను అర్ధరాత్రి కూల్చిన వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు సిగ్గు అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.