Kadapa: డెక్కన్ ట్రైన్‌లో దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2022-10-17T20:11:47+05:30 IST

తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న డెక్కన్ ట్రైన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు.

Kadapa: డెక్కన్ ట్రైన్‌లో దొంగల బీభత్సం

కడప: తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న డెక్కన్ ట్రైన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల నుంచి బంగారు గొలుసులను దోచుకున్న దుండగులు.. కమలాపురం - ఎర్రగుంట్ల మధ్యలోని ఎర్రగుడిపాడు వద్ద ట్రైన్ ఆపి పరుగులు తీశారు. ఎస్‌ 7 కోచ్‌లో కొందరు మహిళ వద్ద నుంచి బంగారు గొలుసులు... ఎస్ 2 కోచ్‌లో ఒకరిది నగదు ఉన్న పర్సును దోచుకుని పారిపోయినట్లు కడప రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన ఎర్రగుడిపాడు రైల్వే స్టేషన్ వద్దకు రైల్వే పోలీసులు చేరుకుని పరిశీలించారు. బాధితులు కడపలో తమకు ఫిర్యాదు ఇవ్వనందున ఇంకా కేసు చేయలేదని కడప రైల్వే పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-10-17T20:11:47+05:30 IST