అవుట్సోర్స్ కార్మికుల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి
ABN , First Publish Date - 2022-08-09T04:59:58+05:30 IST
మం గంపేట ఏపీఎండీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్స్, ట్రైనీ కార్మికులను పున రావాస యాక్ట్ ప్రకారం రెగ్యులర్ చే యాలని ఏపీఎండీసీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూని యన్ గౌరవా ధ్యక్షుడు సి. హెచ్.చంద్రశేఖర్ డిమాం డ్ చేశారు.

ఓబులవారిపల్లె, ఆగస్టు 8 : మం గంపేట ఏపీఎండీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్స్, ట్రైనీ కార్మికులను పున రావాస యాక్ట్ ప్రకారం రెగ్యులర్ చే యాలని ఏపీఎండీసీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూని యన్ గౌరవా ధ్యక్షుడు సి. హెచ్.చంద్రశేఖర్ డిమాం డ్ చేశారు. స్థానిక దేవాలయం వద్ద కుప్పాల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరి గిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ గనుల తవ్వకాలు, విస్తరణ, సంస్థ అభివృద్ధికి మంగంపేట గ్రామ ప్రజలు ఇల్లు, భూములను అప్పజెప్పారన్నారు. వారి కుటుంబాలకు ఏపీఎండీసీ యాజమా న్యం అవుట్సోర్స్, ట్రైనీ పేరుతో ఉద్యోగాలు కల్పించిందన్నారు. వారంతా 14 ఏళ్లుగా వెట్టిచాకిరీ చేస్తున్నారని ఆరోపించారు. మైనింగ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కోడూరు శాసన సభ్యుడు కొరముట్ల శ్రీనివాసులు, ఎం.డి సమక్షంలో చేసుకున్న ఒప్పందానికి బిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధాన కార్యదర్శి నారదాసు సుబ్బరాయుడు, ఆర్గనైజింగ్ సెక్రట రీ మర్రి శంకరయ్య, కోశాధికారి మావిళ్ల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు హనుమగుండం, శివశంక ర్, గల్లా చలపతి, ఉప్పర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.