జీవో 117ను సవరించి హేతుబద్ధీకరణ చేయాలి
ABN , First Publish Date - 2022-06-27T05:48:04+05:30 IST
రాష ్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 117ను సవరించిన తరువాతే హేతు బద్ధీకరణ చేయాలని పశ్చిమరాయల సీమ శాసనమండలి సభ్యుడు కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు.

మదనపల్లె అర్బన్, జూన్ 26: రాష ్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 117ను సవరించిన తరువాతే హేతు బద్ధీకరణ చేయాలని పశ్చిమరాయల సీమ శాసనమండలి సభ్యుడు కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మదనపల్లె పట్టణంలోని ఎస్టీయూ భవన్లో జరిగిన సమావే శానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జీవో 117 వలన విద్యా రంగం నిర్వీర్యమవుతోందని, దీనివలన బడుగు, బలహీన, పేద, మైనార్టీ విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేకపోతార న్నారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు కేవలం ఆంగ్లమాద్యమం ఆధారంగా ఉపాఽధ్యా యులను హేదుబద్ధీకరణ చేయడం దారణంగా ఉందన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఖచ్చితంగా కొనసాగేలా చూడాలని, హెచ్ఎం, వ్యాయామ ఉపా ధ్యాయ పోస్టులను కొనాసాగించాలన్నారు. జీవో సవరణ తరువాతనే రేషనలైజేషన్ , పదోన్నతులు, బదిలీలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోకల మధుసూదన, రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ రమణ, డివిజనల్ కన్వీనర్ నరసింహులు, నాయకులు గిరిధర్ నాయక్, శ్రీనివాసులురెడ్డి, అశోక్, లక్ష్మీనారాయణరెడ్డి, సుబ్బారెడ్డి, నాగరాజు, సుధాకర్‌రెడ్డి, గోపాల్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.