అక్రమ కట్టడాలపై జేసీ ఆరా

ABN , First Publish Date - 2022-08-05T04:56:04+05:30 IST

మండలంలోని మోటకట్ల గ్రామం సంబేపల్లె- వడ్లపల్లె రోడ్డు మార్గంలోని జగనన్న లేఅవుట్‌లో అక్రమ కట్టడాలపై గురువారం జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆరా తీశారు.

అక్రమ కట్టడాలపై జేసీ ఆరా
అక్రమ కట్టడాలపై ఆరాతీస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

సంబేపల్లె, ఆగస్టు4: మండలంలోని మోటకట్ల గ్రామం సంబేపల్లె- వడ్లపల్లె రోడ్డు మార్గంలోని జగనన్న లేఅవుట్‌లో అక్రమ కట్టడాలపై గురువారం జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆరా తీశారు. జగనన్న కాల నీలో నిర్మించిన కట్టడాలను పరిశీలించారు. ఇందుకు సంబంధించి తహసీల్దార్‌ మహేశ్వరిబాయి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రస్తుతం జగనన్న లేఅవుట్‌ హద్దులను గుర్తించి బౌండరీ ఏర్పాటు చేయాలని సూచించారు.  ఇప్పటి వరకు ఇల్లు లేని నిరుపేదలను గుర్తించాలని తెలియజేశారు. అటువంటి వారికి  అర్హతను బట్టి తదుపరి చర్యలను తీసుకోవాలని తెలియజేశారు. మిగిలిన అక్రమ కట్టడాలను తొలగించా లని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌వోలు, మండల సర్వేయర్‌, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-05T04:56:04+05:30 IST