దుకాణాల్లో జగనన్న పాలు

ABN , First Publish Date - 2022-06-30T05:08:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ పిల్లలకు పౌష్టికాహారంలో భాగంగా అందజేస్తున్న పాలు బహిరంగ మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

దుకాణాల్లో జగనన్న పాలు
టి.రాచపల్లెలో విక్రయిస్తున్న జగనన్న పాల ప్యాకెట్లు

అర లీటరు ప్యాకెట్‌ రూ.15కు విక్రయం

గుర్రంకొండ, జూన్‌ 29: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ పిల్లలకు పౌష్టికాహారంలో భాగంగా అందజేస్తున్న పాలు బహిరంగ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. మండలంలోని టి.రాచపల్లె, తరిగొండలోని కొన్ని చిల్లర దుకాణాల్లో అంగన్‌వాడీలో పిల్లలకు సరఫరా చేయాల్సిన పాల ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. అర లీటర్‌ పాల ప్యాకెట్‌ రూ.15కు అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఒక్కొక్కరు 10 నుంచి 15 పాల ప్యాకెట్లను తీసుకెళుతున్నారు. పిల్లల పౌష్టికాహారాన్ని కొందరు బయట విక్రయించడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై ఇన్‌చార్జి సూపర్‌వైజర్‌ జయమ్మ వివరణ కోరగా అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చే పాలను బయట విక్రయించడం తప్పన్నారు. తమ వర్కర్లు ఎవరైనా పాల ప్యాకెట్లను విక్రయించి ఉంటే విచారించి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-06-30T05:08:25+05:30 IST