జగన్‌ వీరబాదుడుకు జనం బెంబేలు

ABN , First Publish Date - 2022-09-30T05:24:00+05:30 IST

తుగ్లక్‌ ముఖ్యమంత్రి వీరబాదుడుకు జనం బెంబేలవుతున్నారని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చారి కస్తూరి విశ్వనాథనాయుడు విమర్శించారు.

జగన్‌ వీరబాదుడుకు జనం బెంబేలు
రైౖల్వేకోడూరు: బాదుడేబాదుడు కార్యక్రమంలో కస్తూరి తదితరులు

రైల్వేకోడూరు(రూరల్‌) సెప్టెంబరు 29:  తుగ్లక్‌ ముఖ్యమంత్రి వీరబాదుడుకు జనం బెంబేలవుతున్నారని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చారి కస్తూరి విశ్వనాథనాయుడు విమర్శించారు. ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు చెత్త పన్ను, ఇంటి పన్ను వంటివాటితో  ప్రతి కుటుంబం నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. గురువారం మండలంలోని శెట్టిగుంట పంచాయతీలో కుక్కలదొడ్డి, ఎస్‌.కొత్తపల్లిలో రైల్వేకోడూరు మార్కెట్‌ కమిటీ మాజీ  ఉపాధ్యక్షుడు జయప్రకాష్‌ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో  రాష్ట్రంలో అన్ని రంగాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ గోరంట్లపై ఎటువంటి చర్యలు తీసుకోకపావడం నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం తప్పక ఈ ప్రభుత్వం చేసింది ఏమిటని ప్రశ్నించారు.  ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు నీలకంఠయ్య, ఓబులవారిపల్లి మండల మాజీ  అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు, రైల్వేకోడూరు మండల టీడీపీ మాజీ  అధ్యక్షుడు సురేష్‌కుమార్‌ రాజు, మహిళ నాయకురాలు దుద్యాల అనిత దీప్తి, హస్తి చంద్రకళ, యువ నాయకులు సుకుమార్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు హస్తి చంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

Read more