-
-
Home » Andhra Pradesh » Kadapa » Jagan owes the state Putta-MRGS-AndhraPradesh
-
రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారు: పుట్టా
ABN , First Publish Date - 2022-03-06T04:51:18+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోచుకోవడం, అప్పులపా లు చేయడమే తప్ప సీఎం జగన్ చేసిన అభివృద్ధి శూన్యమని టీటీడీ మాజీ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ పేర్కొన్నారు.

ఖాజీపేట, మార్చి 5: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోచుకోవడం, అప్పులపా లు చేయడమే తప్ప సీఎం జగన్ చేసిన అభివృద్ధి శూన్యమని టీటీడీ మాజీ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ పేర్కొన్నారు. స్థానిక సర్వర్‌ఖాన్‌పేటలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో నవరత్నాలు ఒక్కో రత్నం ఊడిపోతోందన్నారు. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు అమ్మవొడి పథకం ఎత్తివేసే ఆలోచనతోనే ఎమ్మె ల్యే మాట్లాడుతున్నారన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే ఇంతవరకు నిందితులను అరెస్టు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షులు లక్ష్మిరెడ్డి, షేక్ జిలాన్, జిల్లా అధికార ప్రతినిధి మునిశేఖర్‌రెడ్డి, అన్నవరం సుధాకర్‌రెడి ్డ, మిల్లు శ్రీను, సారె రామానాయుడు, పల్లె గంగాధర్, నిగినేని పుల్లయ్యనాయుడు, వెంకటయ్య యాదవ్, పూల రియాజ్ తదితరులు పాల్గొన్నారు.