ప్రజలే తిరగబడే సమయం వచ్చింది

ABN , First Publish Date - 2022-12-06T23:10:44+05:30 IST

వైసీపీ దుష్ట పాలనపై ప్రజలు తిరగ బడే సమయం వచ్చిందని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ తెలిపారు.

ప్రజలే తిరగబడే సమయం వచ్చింది
మదనపల్లె: ఇదేం ఖర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి

ఫమదనపల్లె టీడీపీ ఇనచార్జి దొమ్మలపాటి రమేశ

విస్తృతంగా ‘ఇదేం ఖర్మ రాషా్ట్రనికి కార్యక్రమం’

ఇంటింటికీ తిరిగి ప్రజాభిప్రాయం సేకరణ

మదనపల్లె టౌన, డిసెంబరు 6: వైసీపీ దుష్ట పాలనపై ప్రజలు తిరగ బడే సమయం వచ్చిందని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ తెలిపారు. మంగళవారం మదనపల్లెలోని సొసైటీ కాలనీలో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాషా్ట్రనికి కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తు వుల ధరలు, విద్యుత చార్జీలు, చెత్తపన్నులతో ప్రజలు వైసీపీపాలనపై విసిగిపోయారని, ప్రజలే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతార న్నారు. యశశ్విరాజ్‌, సిద్దప్ప, నీలకంఠ, బోయపాటి రాణా, మేకల రెడ్డిశేఖర్‌, దాదాపీర్‌ తదితరులు పాల్గొన్నారు.

కలికిరి: పన్నులు, అధిక ధరలతో పేదలను పీడిస్తున్న వైసీపీ ప్రభు త్వాన్ని గద్దె దించాలని పలువురు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం చెరువుముందరపల్లె, మూరేవాండ్లపల్లెలో జరిగిన ఇదేం ఖర్మ రాషా్ట్రనికి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన, వెంకటనారాయణ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, మాలతి, అక్బర్‌, ప్రతాప్‌ రెడ్డి, గౌస్‌మోదీన, హనీఫ్‌, వెంకటపతి, రమేష్‌ చెట్టి, అఽశోక్‌, చంద్ర, అస్లామ్‌, మునాఫ్‌, సైఫుల్లా, గోపాల్‌, గోవర్ధన, సిద్దయ్య, రామకృష్ణ, మూరేవాండ ్లపల్లెలో రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌, సర్పంచు శశికళ, రమణయ్య, గంగాధరయ్య, దేవేంద్ర, సల్లయ్య, వంబాల రెడ్డె య్య, మహేష్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

కలకడ: వైసీపీ ప్రభుత్వంలో అన్నివర్గాలకు ఉపాధి కరువైందని మండ ల టీడీపీ మైనారిటీ నాయకులు విమర్శించారు. మంగళవారం కలకడ రాజీవ్‌నగర్‌ కాలనీలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించి ప్ర జలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. నాయకులు కరీముల్లా, ఖదీమ్‌బాష, జిలానీ, నౌషాద్‌, ఖాజాలు పాల్గొన్నారు.

వాల్మీకిపురం: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని పథకాల పేరుతో కూడా చాలా వరకు నిరు పేదలకు అన్యాయం జరుగుతోందని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సయ్యద్‌షబ్బీర్‌ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని హసనఖానవీధి, బ్రాహ్మణవీధి, తదితర ప్రాంతాలలో పా ర్టీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటిం టా కరపత్రాలు పంపిణీ చేసి ప్రజాభిప్రాయం సేకరించారు. మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, ఉపాధ్యక్షుడు బొక్కసం రామకృష్ణ, నాయకులు జిల్లా ఎస్సీ సెల్‌ గాంధీపేట రమణ, చంద్రమౌళి, పూజారి సురేంద్ర, సయ్యద్‌షఫీ, సయ్యద్‌బాషా, శేషాద్రిరెడ్డి, వల్లిగట్ల వెంకట రమణ, జాఫర్‌, టీస్టాల్‌ సైదు, హనీష్‌, చంద్రారెడ్డి పాల్గొన్నారు.

బి.కొత్తకోట: వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని టీడీపీ బి.కొత్తకోట మండల కన్వీనర్‌ నారాయణస్వామిరెడ్డి ఆరోపించారు. మంగళవారం కరెంట్‌ కాలనీ, హడ్కోకాలనీ, బైపాస్‌ రోడ్డు, తదితర పాంతాల్లో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కుడుం శ్రీనివాసులు, ఎండి. మస్తాన, దేవరింటి కుమార్‌, సుకుమార్‌, బంగారు వెంకట్రమణ, కనకంటి ప్రసాద్‌, షమీవుల్లా, నాగరాజు, రంజితకుమార్‌, రాధాకృష్ణ, బీరంగి గోపి, ఆనంద్‌, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:10:47+05:30 IST