పెనుబాలకు అవార్డు రావడం ఆనందదాయకం

ABN , First Publish Date - 2022-08-18T04:51:20+05:30 IST

మానవసేవే మాధవసేవ అంటూ పేదలకు సేవలు నిర్వహిస్తున్న లీడ్స్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పెనుబాల విజయ్‌కుమార్‌ చేసిన సేవలను గుర్తించి కమిట్‌మెంట్‌ అవార్డు రావ డం ఆనందదాయకమని డిప్యూటీ సీఎం అంజాద్‌బాష పేర్కొన్నారు.

పెనుబాలకు అవార్డు రావడం ఆనందదాయకం

కమిట్‌మెంట్‌ అవార్డు అందించిన డిప్యూటీ సీఎం

కడప (మారుతీనగర్‌) ఆగస్టు, 17: మానవసేవే మాధవసేవ అంటూ పేదలకు సేవలు నిర్వహిస్తున్న లీడ్స్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పెనుబాల విజయ్‌కుమార్‌ చేసిన సేవలను గుర్తించి కమిట్‌మెంట్‌ అవార్డు రావ డం ఆనందదాయకమని డిప్యూటీ సీఎం అంజాద్‌బాష పేర్కొన్నారు. బుధవారం కో-ఆపరేటివ్‌ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పెనుబాలకు అవార్డును అందించిన ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలకు మరింతగా  సేవలందించి తద్వారా మరిన్ని అవార్డులు, రివార్డులూ పొందాలని ఆకాంక్షించారు. తదనంతరం విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ పేదలకుసేవలందించడంలోనే నిజమైన ఆత్మసంతృప్తి  వుందన్నారు. కార్యక్రమంలో బిషప్‌ ఐజాక్‌ వరప్రసాద్‌, పలువురు పాస్టర్లు, పాల్గొన్నారు.

Read more