విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-06-08T05:22:48+05:30 IST

పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పలువురు తమ దుకాణాలు మూసి వెళ్లిపోయిన సంఘటన మంగళవారం మైదుకూరులో జరిగింది.

విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

మైదుకూరు, జూన్‌ 7 : పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పలువురు తమ దుకాణాలు మూసి వెళ్లిపోయిన సంఘటన మంగళవారం మైదుకూరులో జరిగింది.  కడప అధికారులు పి రామక్రిష్ణ, ఆర్‌ పురుషోత్తమరాజు, ఏవో బాలగంగాధర్‌ రెడ్డి తమ సిబ్బందితో కలసి మైదుకూరులోని పలు షాపుల్లో తనిఖీలు చేపట్టారు.  ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎవరైనా నకిలి పురుగు మందులు, విత్తనాలు అమ్మకాలు జరిపినా, రికార్డులు మెయింటెనెన్స్‌ చేయక పోయినా తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏవో లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. 

Read more