ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-10-08T05:02:23+05:30 IST

కడప గనరంలోని పలు ఎరువుల దుకా ణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆర్‌.పురుషోత్తం రాజు, జి.శ్రీనివాసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు
తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

నిబంధనలు అతిక్రమించిన వారిపై 6(ఎ) కేసు నమోదు

అధిక ధరలకు విక్రయిస్తున్న 48 బస్తాల యూరియా సీజ్‌


కడప(రూరల్‌) అక్టోబర్‌ 7 : కడప గనరంలోని పలు ఎరువుల దుకా ణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆర్‌.పురుషోత్తం రాజు, జి.శ్రీనివాసులు శుక్రవారం  ఆకస్మిక  తనిఖీలు నిర్వహించారు. దేవునికడప రోడ్డులోని జయశంకర్‌ ఫెస్టిసైడ్స్‌ అండ్‌ ఫెస్టిలైజర్స్‌ షాపులో రికార్డులు సరిగా నిర్వహించని రూ.2,14,565ల విలువచేసే రెండు రకాల ఎరువులను గుర్తించి స్టాప్‌ సేల్స్‌ ఇచ్చారు. అలాగే శ్రీ సాయి అగ్రి క్రాఫ్‌ కేర్‌ అండ్‌ ఆర్గానిక్‌ షాపును తనిఖీ చేశారు. ఆ షాపులో యూరియా బస్తా ఎంఆర్‌పీ ధర రూ.266.50లు వుండగా   రూ.300లకు అమ్మినట్లు గుర్తించి,  రూ.12,790ల విలువచేసే 48 బస్తాలను సీజ్‌చేశారు. ఆ వ్యాపారిపై ఈసీ యాక్టు 1955 ప్రకారం 6(ఎ) కేసు నమోదు చేశారు. అనంతరం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎరువులు, పురుగుమందులు, విత్తనాల యజమానులను ప్రభుత్వ ధరలకు మాత్రమే అమ్మాలని ఆదేశించారు.  ఎమ్మార్పీ ధరల కన్నా అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. మండల వ్యవసాయాధికారి ఎస్‌.వి.సురే్‌షకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more