గురుకులంలో ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-11-30T23:46:08+05:30 IST

మండల పరిధిలోని బెస్లవారిపల్లెలోని అంబేద్కర్‌ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను బుధవారం ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాప్‌రెడ్డి తనిఖీ చేశారు. పాఠశాల పరి సరాలను, వంట గదులను, బియ్య, కూరగాయల నిల్వలను పరిశీలిం చారు.

గురుకులంలో ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తనిఖీలు
పాఠశాలను పరిశీలిస్తున్న ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి

పులివెందుల టౌన్‌, నవంబరు 30: మండల పరిధిలోని బెస్లవారిపల్లెలోని అంబేద్కర్‌ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను బుధవారం ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాప్‌రెడ్డి తనిఖీ చేశారు. పాఠశాల పరి సరాలను, వంట గదులను, బియ్య, కూరగాయల నిల్వలను పరిశీలిం చారు. విద్యార్థుల భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైన సమస్య వస్తే వెంటనే తమ వాట్సాప్‌ నెంబర్‌ 94905 51117కు సమాచారం అందించాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురుకులంలో ప్లాస్టిక్‌ బియ్యం వినియోగిస్తున్నారని ఫిర్యాదు అందడంతో తనిఖీ చేశామన్నారు. అయితే, అవి ప్లాస్టిక్‌ బియ్యం కాదని, పోర్టిఫైడ్‌ బియ్యమని తెలిపారు. డీఎం అర్జున్‌రావు, డీఎస్‌ఓ సుబ్బారెడ్డి, లీగల్‌ మెట్రాలజీ అధికారి రవీంద్రా రెడ్డి, ప్రిన్సిపాల్‌ బండ్లపల్లె నజీరుల్లా రామచంద్రరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-30T23:46:08+05:30 IST

Read more