ప్రహరీ గోడ నిర్మాణంపై విచారణ

ABN , First Publish Date - 2022-09-27T05:26:36+05:30 IST

కర్మకాండలు చేసుకునే స్థలానికి ప్రహరీ గోడ నిర్మించడం కారణం గా తమ కాలనీకి దారి లేకుండా పోయిందని పి.కొత్తపల్లెకు చెందిన ఓ వర్గానికి చెందిన ప్రజలు ప్ర జావాణిలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.

ప్రహరీ గోడ నిర్మాణంపై విచారణ
దళితవాడలో విచారణ చేస్తున్న రెవెన్యూ సిబ్బంది

పెనగలూరు, సెప్టెంబరు 26 : కర్మకాండలు చేసుకునే స్థలానికి ప్రహరీ గోడ నిర్మించడం కారణం గా తమ కాలనీకి దారి లేకుండా పోయిందని పి.కొత్తపల్లెకు చెందిన ఓ వర్గానికి చెందిన ప్రజలు ప్ర జావాణిలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎంఆర్‌ఐ చంద్రమౌళిరెడ్డి, వీఆర్వోలు కొండ య్య, మౌలాలి, సర్వేయరు చిన్నా విచారణ చేశారు. ఆ వర్గానికి చెందిన కాలనీ, ఉర్దూ పాఠశాలకు మూడు వైపులా దారి ఉండడాన్ని గుర్తించారు. ఎనగలూరుకు చెందిన దళితుల స్టేట్‌మెంటు రికార్డు చేశారు. దాదాపు రెండు వందల ఏళ్లుగా ఈ ప్రదేశంలో కర్మకాండలు చేసుకుంటున్నామని, మహిళల సౌకర్యార్థం  తమ స్థలంలోనే గోడ కట్టుకున్నామని వారు పేర్కొన్నారు. తమపై  చిన్న చూపుతోపాటు, ఈ స్థలం కబ్జా చేసేందుకే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు.  విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు తహసీల్దారు శ్రీధర్‌రావు తెలిపారు.

Read more