ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం ఒంటికాలిపై దీక్ష

ABN , First Publish Date - 2022-08-05T05:01:45+05:30 IST

ప్రస్తుత పార్లమెం ట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలంటూ ఎంఆర్‌పీఎస్‌ జాతీయ నాయ కుడు రామాంజనేయు లు, జిల్లా ప్రధాన కార్య దర్శి శ్రీనివాసులు ఆధ్వ ర్యంలో గురువారం ఎం ఆర్‌పీఎస్‌ నేతలు ఒంటి కాలిపై నిలుచుని నిరస న వ్యక్తం చేశారు.

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం ఒంటికాలిపై దీక్ష
ఒంటికాలిపై దీక్ష చేస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నేతలు

రాయచోటిటౌన్‌, ఆగస్టు 4:  ప్రస్తుత పార్లమెం ట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలంటూ ఎంఆర్‌పీఎస్‌ జాతీయ నాయ కుడు రామాంజనేయు లు, జిల్లా ప్రధాన కార్య దర్శి శ్రీనివాసులు ఆధ్వ ర్యంలో గురువారం ఎం ఆర్‌పీఎస్‌ నేతలు ఒంటి కాలిపై  నిలుచుని నిరస న వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఎస్సీల్లో 59 ఉప కులాలకు సమ న్యా యం చేసేందుకు ఎస్సీ వర్గీకరణ చేయాలని కో రుతూ 28 ఏళ్లుగా  నిర వధిక పోరాటం జరు గుతోందన్నారు.  యూపీఏ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతిస్తామని, లేని పక్షంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చా రన్నారు. వారు అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడు స్తున్నా ఇంత వరకు వర్గీకరణ ఊసే ఎత్తకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా  ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేకుంటే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చ రించారు. 13వ రోజు దీక్షలో ఎంఆర్‌పీఎస్‌ నాయ కులు రామయ్య, చంద్రయ్య, సుబ్బయ్య, వెంకట్ర మణ, లక్షుమయ్య, నాగరాజ, బాలాజీ, చంద్ర శేఖర్‌, నారాయణ, రెడ్డెయ్య, లక్ష్మినారాయణ, వెంకట్రమణ, వెంకటాద్రి, రెడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-05T05:01:45+05:30 IST