ఫ్యామిలీ డాక్టర్‌ షెడ్యూల్‌ను ముందే తెలపండి

ABN , First Publish Date - 2022-12-31T23:20:54+05:30 IST

ఫ్యామిలీ డాక్టర్‌ గ్రామాలకు వెళ్లే షెడ్యూల్‌ ముందే తెలపాలని అధికారులను కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి అనీమియా టెస్టింగ్‌, వైద్య సిబ్బంది హాజరు, ఫ్యామిలీ ఫిజిషియన్‌ తదితర అంశాలపై డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, పీహెచ్‌సీ సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల డాక్టర్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఫ్యామిలీ డాక్టర్‌ షెడ్యూల్‌ను ముందే తెలపండి
వైద్యాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీషా

వైద్య అధికారులను ఆదేశించిన కలెక్టర్‌

రాయచోటి (కలెక్టరేట్‌), డిసెంబరు 31: ఫ్యామిలీ డాక్టర్‌ గ్రామాలకు వెళ్లే షెడ్యూల్‌ ముందే తెలపాలని అధికారులను కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి అనీమియా టెస్టింగ్‌, వైద్య సిబ్బంది హాజరు, ఫ్యామిలీ ఫిజిషియన్‌ తదితర అంశాలపై డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, పీహెచ్‌సీ సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల డాక్టర్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా హాస్పిటల్‌ ముఖ ఆధారిత హాజరును పక్కాగా అమలు చేయాలని డాక్టర్లను ఆదేశించారు. ముఖ ఆధారిత హాజరును డిప్యూటీ డీఎంహెచ్‌వోలు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ టెస్టింగ్‌ కచ్చితంగా చేయాలని మెడికల్‌ ఆఫీసర్లను కలెక్టర్‌ ఆదేశించారు. దేవపట్ల 45 శాతం, సుండుపల్లె 52 శాతం చేశారని, ఇంప్రూవ్‌ కావాలని సూచించారు. వచ్చేవారానికల్లా ప్రతి పీహెచ్‌సీలో రెండు హిమోగ్లోబిన్‌ పరికరాలను కొనుగోలు చేయాలని తెలిపారు. పీటీయం మెడికల్‌ ఆఫీసర్‌ క్యాన్సర్‌ రోగులకు మంచి వైద్య సేవలు అందించడంతో కలెక్టర్‌ అతడిని అభినందించారు. హైరిస్క్‌ ఉమెన్‌ చివరి వరకు వేచి ఉండకుండా ముందుగానే హాస్పిటల్‌లో చేర్పించి మంచి సేవలు అందించాలన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులకు సంబంధించి ఈకేవైసీ త్వరగా చేయించాలన్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. కొవిడ్‌ ప్రోటోకాల్‌ తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ కొండయ్య, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల డాక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:20:54+05:30 IST

Read more