పెద్దేరు ప్రాజెక్టుకు పెరిగిన సందర్శకుల తాకిడి

ABN , First Publish Date - 2022-12-18T23:50:51+05:30 IST

మండలంలోని కొటాల పంచాయతీలో ఉన్న పెద్దేరు జలాశయం వద్ద ఆదివారం సందర్శకుల సంద డి కనిపించింది.

 పెద్దేరు ప్రాజెక్టుకు పెరిగిన సందర్శకుల తాకిడి
పెరిగిన సందర్శకుల తాకిడి

తంబళ్లపల్లె, డిసెంబరు 18: మండలంలోని కొటాల పంచాయతీలో ఉన్న పెద్దేరు జలాశయం వద్ద ఆదివారం సందర్శకుల సంద డి కనిపించింది. మాండస్‌ తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పెద్దేరు జలాశయం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో జలాశయం నీటి ప్రవాహ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. మొరవపై నుంచి దూకుతున్న నీటి పరవళ్లను చూసి ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. ఆదివారం ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా సందర్శకులు తరలివచ్చి ప్రాజెక్టు మొరవ నీటి ప్రవాహ అందాలను ఆస్వాదించారు. ప్రాజెక్టు నీటి ప్రవాహం వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2022-12-18T23:50:53+05:30 IST