కూలీల సంఖ్య పెంచండి

ABN , First Publish Date - 2022-10-08T04:24:49+05:30 IST

ఉపాధి హామీ పథ కంలో కూలీల సంఖ్య పెంచాలని డ్వామా పీడీ మద్దిలేటి సిబ్బందికి సూచించారు. గుర్రంకొండ లో శుక్రవారం ఆయన ఉపాధి పనులను పరిశీ లించారు.

కూలీల సంఖ్య పెంచండి

గుర్రంకొండ, అక్టోబరు 7:ఉపాధి హామీ పథ కంలో కూలీల సంఖ్య పెంచాలని డ్వామా పీడీ మద్దిలేటి సిబ్బందికి సూచించారు. గుర్రంకొండ లో శుక్రవారం ఆయన ఉపాధి పనులను పరిశీ లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రా మాల్లో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలన్నారు. కూలీలు పనులకు వచ్చేలా సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అవసరమైన పనులను గుర్తించాలని సూచించా రు. మండలంలోని కొంత మంది ఫీల్డ్‌ అసి స్టెంట్లు అవినీతికి పాల్పడుతునట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వారు పని తీరు మార్చు కోకుంటే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఏపీవో రెడ్డిజవహరి, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T04:24:49+05:30 IST