జీవో చూపిస్తే రాజకీయం సన్యాసం చేస్తారా..?

ABN , First Publish Date - 2022-10-01T05:26:33+05:30 IST

తాగునీటి పఽథకం కోసం 90 కోట్ల పనులకు సంబంధించిన జీవో చూపిస్తే ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ టీడీపీ ఇన్‌చార్జ్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ విలేకరుల సమావేశంలో సవాల్‌ విసిరారు.

జీవో చూపిస్తే రాజకీయం సన్యాసం చేస్తారా..?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పుట్టా సుధాకర్‌యాదవ్‌

మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌
మైదుకూరు రూరల్‌ సెప్టెంబరు 30 :
తాగునీటి పథకం కోసం 90 కోట్ల పనులకు సంబంధించిన జీవో  చూపిస్తే ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ టీడీపీ ఇన్‌చార్జ్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ విలేకరుల సమావేశంలో సవాల్‌ విసిరారు. స్థానిక టీడీపీ  కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్టా మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధికి పుట్టా సుధాకర్‌యాదవ్‌ 950 కోట్ల  నిధులను తెచ్చారన్నది వాస్తవం కాదని, అన్ని నిధులు తెచ్చిఉంటే మున్సిపాలిటీలో తాగునీటి కోసం 90 కోట్ల  రూపాయలకు సంబంధించి జీవో చూపించాలని ఎమ్మెల్యే చాపాడులో ప్రజలకు చెప్పడం తగదని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి 950 కోట్లనిధులకు సంబంధించి  ఎక్కడ ఏఏ పనులు చేశామో, కరపత్రాలు కూడా పంపిణీ చేశామని  పుట్టా తెలిపారు. అంతేకాకుండా 90 కోట్లకు సంబంధించి జీవో నేను చూపించకుంటే రాజకీయం సన్యాసం చేస్తానని, ఒకవేళ జీవో చూపిస్తే ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం చేయడానికి రెడీనా అంటూ సవాలు విసిరారు. అంతేకాకుండా ఎన్ని రోజుల్లో ఎమ్మెల్యే సమాధానం చెబుతారో తెలిపితే అప్పటి వరకు వేచి ఉంటామని పుట్టా తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు, అన్నవరం సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more