చదువుల తల్లీ.. నమోస్తుతే...

ABN , First Publish Date - 2022-10-03T05:36:47+05:30 IST

దసరా శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడోవరోజు అమ్మవారు చదువులతల్లీ సరస్వతీ దేవిగా భక్తులను కటాక్షించారు.

చదువుల తల్లీ.. నమోస్తుతే...
మదనపల్లెలో అమ్మవారి అలంకరణ

మదనపల్లె అర్బన్‌, అక్టోబరు 2:దసరా శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడోవరోజు అమ్మవారు చదువులతల్లీ సరస్వతీ దేవిగా భక్తులను కటాక్షించారు.  ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సావాల్లో భా గంగా నీరుగుట్టువారిపల్లెలో చౌడేశ్వరిదేవి ఆలయంలో చౌడేశ్వరీదేవిని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉప్పు రామ చంద్ర, సెక్రటరీ గుండ్లపల్లె ప్రభాకర్‌, ట్రెజరర్‌  లోకేష్‌ ఆధ్వర్యంలో  సరస్వతిదేవి అలంకరణచేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తొగటక్షత్రియసంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కృష్ణమూర్తి, అన్నమయ్య జిల్లాఅధ్యక్షుడు భోజన పు వెంకటనారాయణ, గౌరవాధ్యక్షుడు మోడెం వెంకట రమణ, తొగట కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ శీలం రమణ మ్మ రమేష్‌ బాబు,  భక్తులు పాల్గొన్నారు. పట్టణంలో వాసవీభవన్‌ వీధిలోని వాసవీ కన్యకా పరమే శ్వరీదేవి ఆలయంలో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని సరస్వతీదేవగా అలంకరించి పూజలు చేశారు.  కార్యక్ర మంలో మదనపల్లె ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు పూన గంటి ఓంప్రకాష్‌, ట్రెజరర్‌ గిరిధర్‌, సెక్రటరీ దేవత సతీష్‌, మహిళసంఘాల సభ్యులు పాల్గొన్నారు.  పట్ట ణంలోని కోర్టు ఆవరణలో ఉన్న గంగమ్మ ఆలయంలో సాయంత్రం ఆలయకమిటీ సభ్యులు మార్పురి సుధా కర్‌నాయుడు,  నాగార్జునబాబు (గాంధీ)  ఆనందరెడ్డి, చైతన్యకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సరస్వతి దేవిగా అలం కరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.  దేవతాన గర్‌లోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో ఽధర్మకర్త పతాం జలీ స్వామి ఆధ్వర్యంలో  అమ్మవారిని సరస్వతిదేవిగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. మదనపల్లెలో అమ్మవారి అలంకరణRead more