టీటీడీలో కలిపితే కోర్టును ఆశ్రయిస్తా

ABN , First Publish Date - 2022-11-16T23:26:03+05:30 IST

జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సౌమ్యనాథస్వామి ఆలయాన్ని టీటీడీలో కలిపితే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆలయ చైర్మన్‌ సౌమిత్రి చంద్రనాధ్‌ వెల్లడించారు.

టీటీడీలో కలిపితే కోర్టును ఆశ్రయిస్తా

ఆలయ చైర్మన్‌ సౌమిత్రి చంద్రనాధ్‌

రాజంపేట, నవంబరు 16: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సౌమ్యనాథస్వామి ఆలయాన్ని టీటీడీలో కలిపితే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆలయ చైర్మన్‌ సౌమిత్రి చంద్రనాధ్‌ వెల్లడించారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ టీటీడీలో ఈ ఆలయాన్ని విలీనం చేయడం వల్ల ఇక్కడి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. నేడు భక్తుల విరాళాలతో ఆలయం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, సామాన్య భక్తులు కూడా సులభరీతిలో సౌమ్యనాథున్ని దర్శించుకుంటారన్నారు. టీటీడీలో కలిపితే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ విషయంలో పునరాలోచించి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-11-16T23:26:05+05:30 IST