ఇది మాయల మరాఠీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-19T05:51:48+05:30 IST

రాష్ట్రంలో మాయల మరాఠీల పాలన సాగుతోందని కాంగ్రెస్‌ పార్టీ రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జి గోల్డ్‌ అల్లాబకష్‌ అన్నారు.

ఇది మాయల మరాఠీ ప్రభుత్వం
9వ వార్డులో ప్రజల సమస్యలపై ఆరాతీస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు

 కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గోల్డ్‌ అల్లాబకష్‌
రాయచోటిటౌన్‌, మే18:
రాష్ట్రంలో మాయల మరాఠీల పాలన సాగుతోందని కాంగ్రెస్‌ పార్టీ రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జి గోల్డ్‌ అల్లాబకష్‌ అన్నారు. బుధవారం ఆయన  రాయచోటి మున్సిపాలిటీలోని 9వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ మున్సిపల్‌ చైర్మెన్‌ సహా మున్సిపల్‌ కౌన్సిలర్లు అందరూ ఏకగ్రీవమైనా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. రూ.380 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి విడుదలయ్యాయని చెప్పుకొంటున్న వైసీపీ నాయకులు ఆ డబ్బును ఎక్కడ దాచిపెట్టారో చెబితే ప్రజలే ఆ డబ్బు తెచ్చుకుని సమస్యలు పరిష్కరించుకుంటారన్నారు.  స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మన్సూర్‌అలీఖాన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దర్బార్‌బాషా, శర్వాణీ షారూక్‌ఖాన్‌, కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకుడు ఫయాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T05:51:48+05:30 IST