అంగన్వాడీ భవనాలకు స్థలాలు గుర్తించండి
ABN , First Publish Date - 2022-10-18T04:32:16+05:30 IST
అంగన్వాడీ భవన నిర్మాణాలకు స్థలాలు గుర్తించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పీఎస్ గిరీషా ఆదేశించారు.
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి (కలెక్టరేట్), అక్టోబరు 17: అంగన్వాడీ భవన నిర్మాణాలకు స్థలాలు గుర్తించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పీఎస్ గిరీషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి, మ్యుటేషన్ కరెక్షన్, అంగన్వాడీ భవన నిర్మాణాలకు స్థలాల గుర్తింపు తదితర అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్‌లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇంటి పట్టాలకు సంబంధించి ఈకేవైసీ వంద శాతం పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలు నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తయ్యేటట్లు చూడాలన్నారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేయకుండా కొన్నిచోట్ల పెండింగ్‌లో ఉన్నాయని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో అవసరమైన చోట నూతన అంగన్వాడీ భవన నిర్మాణాలకు స్థలాలు గుర్తించాలని తెలిపారు. అంగన్వాడీ స్కూల్ ఆయా గ్రామాల్లోనే నిర్మించేందుకు స్థలాలు చూడాలన్నారు. ఒక స్కూలు నిర్మాణానికి రెండు, మూడు సెంట్ల స్థలం ఉండేటట్లు చూడాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఆర్‌వో సత్యనారాయణ, ఏవో బాలకృష్ణ, తహసీల్దార్లు, హౌసింగ్ పీడీ శివయ్య తదితరులు పాల్గొన్నారు.