‘మానవత’ శాంతి ర్యాలీ
ABN , First Publish Date - 2022-08-23T05:05:11+05:30 IST
మానవతా ఆధ్వర్యంలో సోమవారం మండల అధ్యక్షుడు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.
ముద్దనూరు ఆగస్టు22: మానవతా ఆధ్వర్యంలో సోమవారం మండల అధ్యక్షుడు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రిక్రియేషన్ క్లబ్ ఆవరణం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు విద్యార్థులు, అధికారులు, మానవతా మెంబర్లు ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలి విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో సీఐ మోహన్‌రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి,గురు ట్రాన్స్‌పోర్టు అధినేత గుర్రప్ప, మానవత మెంబర్లు శేషయ్య, జగదీ్‌షబాబు, చలమయ్య, సాంబశివారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
జమ్మలమడుగు రూరల్..: జమ్మలమడుగు పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో బాలాజీ హైస్కూలు వద్ద సోమవారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఛైర్‌పర్సన్ శివమ్మ ర్యాలీ ప్రారంభించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జమ్మలమడుగు వారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ప్రారంభమైంది. వారు మాట్లాడుతూ ప్రపంచ శాంతికై మానవతా ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని సర్వమానవులు శాంతితో జీవించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటరామిరెడ్డి, మానవతావాద స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.