పెనుగాలులకు నేలకొరిగిన భారీ వృక్షాలు

ABN , First Publish Date - 2022-09-30T05:28:52+05:30 IST

పెనుగాలులకు పలు ప్రాం తాల్లో భారీ వృక్షాలు నేల కొరిగాయి. స్థానిక ఆర్‌.ఎస్‌. రోడ్డులో ఓ చింతచెట్టు తెల్ల వారుజామున 4 గంటలకు రోడ్డుపై పడిపోవడంతో రా యచోటి-రాజంపేట మధ్య రా కపోకలకు అంతరాయం ఏ ర్పడింది

పెనుగాలులకు నేలకొరిగిన భారీ వృక్షాలు
ఆర్‌.ఎస్‌.రోడ్డులో నేలకొరిగిన చింతచెట్టు

రాజంపేట, సెప్టెంబరు 29: పెనుగాలులకు పలు ప్రాం తాల్లో భారీ వృక్షాలు నేల కొరిగాయి. స్థానిక ఆర్‌.ఎస్‌. రోడ్డులో ఓ చింతచెట్టు తెల్ల వారుజామున 4 గంటలకు రోడ్డుపై పడిపోవడంతో రా యచోటి-రాజంపేట మధ్య రా కపోకలకు అంతరాయం ఏ ర్పడింది. సమాచారం అందు కున్న మున్సిపల్‌ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి వెంటనే అగ్నిమాపక అధికారులు, మున్సి పల్‌ సిబ్బంది సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు..  ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. 

పెనగలూరు: ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో బుధవారం తెల్లవారు జాము నుండి ఉదయం 9గంటల వరకు మండలంలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షంతో వ్యవసాయానికి ఎలాంటి ఉపయోగం లేదని రైతులు అంటున్నారు. 

Read more