గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-10-08T05:03:54+05:30 IST

జిల్లాలో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు హౌసింగ్‌ ఇంజనీర్లను ఆదేశించారు.

గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌) అక్టోబరు 7 : జిల్లాలో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు హౌసింగ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం  కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కృష్ణయ్యతో కలసి  గృహ నిర్మాణ పురోగతి, మౌలిక వసతులు,  అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకా అమ లు తీరు తదితర అంశాలతో కూడి న అజెండాపై మండల, నియోజకవర్గ స్థాయి ఇంజనీర్లతో కలెక్టర్‌ నేరుగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సేవలు ప్రజలకు సంతృప్తిస్థాయి లో అందేలా.. లక్ష్యం మేరకు బాధ్యతగా పని చేయాలని  ఆదేశించారు. వారం, వారం హౌసింగ్‌ పురోగతిపై నివేదికలు అందజేయాలన్నారు. మున్సిపాలిటీ లే-అవుట్స్‌లో గృహ నిర్మాణ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఇసుక, స్టీల్‌, సిమెంట్‌ ఇతర వస్తు సామాగ్రిని సమకూర్చి లక్ష్యం మేరకు గడువులోపు పూర్తి చేయాలన్నారు. హౌసింగ్‌ బిల్లులు కూడా సకాలంలో లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T05:03:54+05:30 IST