గృహ నిర్మాణాలు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-12-16T23:41:58+05:30 IST
మండలంలోని జగనన్న లేఅవుట్‌లో నిర్మాణంలో ఉన్న గృహాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి నాగరాజు, తహసీల్దారు జీవన్ చంద్రశేఖర్,ఎంపీడీవో హరినారాయణ అన్నారు.
గోపవరం, డిసెంబరు 16 : మండలంలోని జగనన్న లేఅవుట్‌లో నిర్మాణంలో ఉన్న గృహాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి నాగరాజు, తహసీల్దారు జీవన్ చంద్రశేఖర్,ఎంపీడీవో హరినారాయణ అన్నారు. శుక్రవారం సాయంత్రం మండల సభా భవన కార్యాలయంలో జగనన్న ఇళ ్ల నిర్మాణ ప్రగతిపై మండల, గ్రామ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహ నిర్మాణాలను ఈ నెల 21 లోపు లక్ష్యాల మేరకు పూర్తి చేయాలన్నారు. జగనన్న లే అవుట్లలో అన్ని వసతుల కల్పన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐసీడీఎస్ సూపర్‌వైజరు, పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.