హే కృష్ణా..ముకుందా
ABN , First Publish Date - 2022-08-19T04:47:50+05:30 IST
మండలంలోని వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లెలోని ఆవధూత ఆదినారాయణస్వామి ఆశ్రమంలో ఉన్న శ్రీకృష్ణుడి భారీ విగ్ర హం కృష్ణాష్టమి వేడుకలకు సిద్ధమైంది.
కృష్ణాష్టమి వేడుకలకు
ముస్తాబైన 60 అడుగుల విగ్రహం
ములకలచెరువు, ఆగస్టు 18: మండలంలోని వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లెలోని ఆవధూత ఆదినారాయణస్వామి ఆశ్రమంలో ఉన్న శ్రీకృష్ణుడి భారీ విగ్ర హం కృష్ణాష్టమి వేడుకలకు సిద్ధమైంది. రాయలసీమలోనే అతిపెద్ద విగ్రహమైన శ్రీకృష్ణు డి విగ్రహం ఇక్కడ ఉంది. విగ్రహం ఎత్తు 60 అడుగులు. శుక్రవారం శ్రీకృష్ణాష్టమి కావడంతో వేడుకల కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. ఆశ్రమంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని నిర్వాహకుడు వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.