రైల్వేకోడూరులో జోరు వాన

ABN , First Publish Date - 2022-11-23T23:18:59+05:30 IST

నియోజకవర్గంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. నియోజకవర్గంలోని చిన్నచిన్న వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి.

రైల్వేకోడూరులో జోరు వాన
రైల్వేకోడూరు ప్రధానదారిలో జల ప్రవాహం

జలమయమైన రోడ్లు

పంటల్లో నిలిచిన నీరు

ఆందోళనలో రైతులు

రైల్వేకోడూరు, నవంబరు 23: నియోజకవర్గంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. నియోజకవర్గంలోని చిన్నచిన్న వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. రైల్వేకోడూరు పట్టణంలోని రంగనాయకులపేట, ధర్మాపురం, పాతబాజరు, ప్రధానదారి, మార్కెట్‌ వీధి, అంకమ్మనగర్‌కు వెళ్లే దారి, తులసి స్కూలు ఎదురుగా ప్రధానదారి ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షంతో భవననిర్మాణ కార్మికులకు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అరటి, బొప్పాయి తదితర పంటలలో నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. అంటు మొక్కల ఎగుమతులు ఆగిపోయినట్లు వ్యాపారులు వాపోతున్నారు. అరటి, బొప్పాయి కోతలు ఆగిపోయాయి. కూలీలు తోటల్లోకి వెళ్లడం లేదు. పట్టణంలో జోరు వానతో దుకాణాలు తదితర వాటిల్లోకి నీరు చేరింది. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - 2022-11-23T23:19:01+05:30 IST