జమ్మలమడుగు నుంచే పోటీ చేస్తా

ABN , First Publish Date - 2022-09-30T05:52:11+05:30 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం జమ్మలమడుగు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి తెలిపారు. బీజేపీ చేస్తున్న ప్రజాపోరులో భాగంగా కొండాపురంలోని ప్రధాన కూడలిలో గురువారం

జమ్మలమడుగు నుంచే పోటీ చేస్తా
బీజేపీ ప్రజాపోరు సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి

రాష్ట్రంలో జీఎస్టీ కంటే జేఎస్టీ ఎక్కువ

గండికోట ఆర్‌అండ్‌ఆర్‌పై ప్రజల తరపున కోర్టుకు 

మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి

కొండాపురం, సెప్టెంబరు 29: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం జమ్మలమడుగు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి తెలిపారు. బీజేపీ చేస్తున్న ప్రజాపోరులో భాగంగా కొండాపురంలోని ప్రధాన కూడలిలో గురువారం సాయంత్రం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ కంటే జేఎస్టీ (జగన్‌ సెల్ఫ్‌ ట్యాక్స్‌) ఎక్కువైందన్నారు. కేంద్రం నిధులన్నీ స్వాహా చేసి తన పథకాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఇసుక, లిక్కర్‌, గనులు అమ్ముకొంటూ వేలకోట్లు దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే జగన్‌ ప్రభుత్వానికి చెక్‌ పెట్టేందుకు తాము ఊరూరా రంగంలోకి దిగామన్నారు. రాష్ట్రంలో కేంద్రం వేసిన నేషనల్‌ హైవే రోడ్లు తప్ప జగన్‌రెడ్డి ఒక్క గుంతనైనా పూడ్చారా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులను స్వాహా చేశారన్నారు. గండికోట ఆర్‌అండ్‌ఆర్‌ పనుల్లో కమీషన్లు దోచుకున్నారని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై మండిపడ్డారు. గండికోట ప్రాజెక్టుకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై ప్రజల తరపున కోర్టుకు వెళ్తానని తెలిపారు. అక్టోబరులో కొండాపురం రైల్వే స్టాపింగ్‌పై కేంద్రం రైల్వే శాఖ మంత్రిని కలిసి మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఇన్‌చార్జి దేవగుడి శివనారాయణరెడ్డి, దేవగుడి రాజేశ్వరరెడ్డి, మాజీ సర్పంచు నరసింహారెడ్డి, గండ్లూరు శంకర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more