పోరుమామిళ్ల వాసులకు పసిడి పతకాలు

ABN , First Publish Date - 2022-10-04T05:35:50+05:30 IST

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్‌ స్టేడియంలో గత నెల 29 నుంచి అక్టోబరు 2వ తేది వరకు జరిగిన తైక్వాండో పోటీల్లో పోరుమామిళ్లకు చెందిన క్రీడాకారులు పసిడి పతకాలు సాధించారని మాస్టర్‌ నాయబ్‌ రసూల్‌ పేర్కొన్నారు. పోరుమామిళ్ల నుంచి 30 మంది క్రీడాకారులు పాల్గొంటే 22 మంది పతకాలు సాఽధించారన్నారు.

పోరుమామిళ్ల వాసులకు పసిడి పతకాలు
పతకాలు సాధించిన పోరుమామిళ్ల క్రీడాకారులు

పోరుమామిళ్ల, అక్టోబరు 3: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్‌ స్టేడియంలో గత నెల 29 నుంచి అక్టోబరు 2వ తేది వరకు జరిగిన తైక్వాండో పోటీల్లో పోరుమామిళ్లకు చెందిన క్రీడాకారులు పసిడి పతకాలు సాధించారని మాస్టర్‌ నాయబ్‌ రసూల్‌ పేర్కొన్నారు. పోరుమామిళ్ల నుంచి 30 మంది క్రీడాకారులు పాల్గొంటే 22 మంది పతకాలు సాధించారన్నారు. బంగారు పతకం సాధించిన వారిలో సబ్‌ జూనియర్స్‌ విభాగంలో ఆకుల గోవర్ధన్‌, క్యాడెట్‌ విభాగంలో కె.తన్వీర్‌, ఖాసీం, జూనియర్‌ బాలుర విభాగంలో నయూమ్‌,  దిలీప్‌,  బాలికల విభాగంలో సాయిప్రీతి, సంగ భవ్య, సీనియర్‌ విభాగంలో గురుసాయి ఉన్నారు. అలాగే రజత పతకం సాధించిన వారిలో సబ్‌ జూనియర్స్‌ విభాగంలో భార్గవ్‌కృష్ణ, క్యాడెట్‌ విభాగంలో ఆఫ్రీన్‌, జుబేదా, జూనియర్‌ విభాగంలో ఆశిక్‌, చరణ్‌, కాంస్య పతకాల విభాగంలో, సబ్‌ జూనియర్స్‌లో శ్రీనిధ్‌, సుహాన్‌, ఖాజా, మౌనిస్‌,  బాలుర విభాగంలో లాయం విజయ్‌, అమర్‌నాథ్‌, శ్రీరామ్‌ విజయ్‌లు ఉన్నారు. వీరికి కాశినాయన మండల ఎంపీడీవో ముజాఫర్‌ రహీమ్‌ అభినందనలు తెలిపారు.  

Read more