నిధులు మంజూరు చేయించండి

ABN , First Publish Date - 2022-11-19T00:08:56+05:30 IST

పదేళ్లుగా పాత బకాయిలు రాక కష్టా లు పడుతున్నామని ని ధులు మంజూరు చే యించాలని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిని చ క్కెర కర్మాగారం కార్మికులు విన్నవించారు.

నిధులు మంజూరు చేయించండి
కార్మికుల సమస్యలు వింటున్న ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి

ఎమ్మెల్యేను కోరిన చక్కెర కర్మాగారం కార్మికులు

చెన్నూరు, నవంబరు 18: పదేళ్లుగా పాత బకాయిలు రాక కష్టా లు పడుతున్నామని ని ధులు మంజూరు చే యించాలని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిని చ క్కెర కర్మాగారం కార్మికులు విన్నవించారు. శుక్రవారం బలసింగాయపల్లెలో జరిగిన గడప గడపకూ కార్యక్రమంలో కనుపర్తి, దౌలతాపురం ఎస్టీ రామాపురం గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. 2012 నుంచి రావలసిన బకాయిలు ఉన్నాయని, నిధులు మంజూరైతే కొంత వరకైనా కష్టాలు తీరుతాయని ఎమ్మెల్యేను కోరారు. సీఎంతో మాట్లాడి దౌలతాపురం, ఎస్టీ రామాపురం రోడ్లను బాగు చేయిస్తానన్నారు. నీళ్ల ట్యాంకుకు టెండర్లు కూడా పిలుస్తామన్నారు. కార్యక్రమంలో ఆ గ్రామ నేతలు ఎస్‌.రఘురామిరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు, ఎంపీపీ చీర్ల సురే్‌షయాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన జీఎన భాస్కర్‌రెడ్డి, ముదిరెడ్డి సుబ్బారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:08:56+05:30 IST

Read more