రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-12-16T23:59:22+05:30 IST

అతివృష్టి, అనావృష్టితో తీవ్రంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి మల్లికార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు.

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

వీరపునాయునిపల్లె, డిసెంబరు 16: అతివృష్టి, అనావృష్టితో తీవ్రంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి మల్లికార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో తుఫాన వల్ల దెబ్బతిన్న పలు పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాల కారణంగా వరి, బుడ్డశనగ, జొన్న, పత్తి, మినుము, పెసర, కంది తదితర పంటలు నీటిపాలయ్యాయన్నారు. అలాగే 2019లో పత్తి రైతులకు చెల్లించాల్సిన ప్రీమియం ఇన్సూరెన్స కంపెనీలు, అగ్రికల్చర్‌ వారు వెరిఫికేషన, చేసి ఇన్సూరెన్స కంపెనీ, అగ్రికల్చర్‌ అధికారులు జాబితా తయారు చేశారని, ఇంతవరకు ఇన్సూరెన్స పడిన దాఖలాలు లేవన్నారు.

Updated Date - 2022-12-16T23:59:25+05:30 IST