చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-11-24T23:49:33+05:30 IST

వర్షాలు కారణంగా నష్టపో యిన చేనేతరంగాన్ని, కార్మికు లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం చేనేత యువజన రాష్ట్ర అధ్యక్షుడు వీర భాస్కర్‌ కోరారు.

చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
వర్షాలతో మెత్తబడిన వార్పును చూపుతున్న వీరభాస్కర్‌

మదనపల్లె అర్బన, నవంబ రు 24: వర్షాలు కారణంగా నష్టపో యిన చేనేతరంగాన్ని, కార్మికు లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం చేనేత యువజన రాష్ట్ర అధ్యక్షుడు వీర భాస్కర్‌ కోరారు. జిల్లాలో తుఫాను కారణంగా చేనేతమీదే ఆధారపడి జీవిస్తున్న కార్మికు లు జీవనోపాధికోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వారికి నిత్యావసర సరుకులు, 50 కేజీల బియ్యం, పదివేల నగదు రూపంలో సాయం అందివ్వాలని డిమాండ్‌ చేశారు. విరివిగా ముద్ర రుణాలను మంజూరు చేయాలని కోరారు. అర్హతను బట్టి చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చాల న్నారు. కార్యక్రమంలో రెడ్డెప్ప, భాస్కర్‌, శ్రీనా పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:49:35+05:30 IST