-
-
Home » Andhra Pradesh » Kadapa » Government mission to provide employment to the unemployed-MRGS-AndhraPradesh
-
‘నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయం’
ABN , First Publish Date - 2022-10-02T05:04:40+05:30 IST
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభు త్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఉప ము ఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా పేర్కొన్నారు.

కడప (ఎడ్యుకేషన), అక్టోబరు1:నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభు త్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఉప ము ఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా పేర్కొన్నారు. కడప నగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం ఆంధ్రప్రదేశ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ శిలాఫలకా న్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారని, అందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి స్కిల్ డెవల్‌పమెంటు కళాశాల, రాష్ట్రంలో రెండు డెవల్‌పమెంటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. అందులో భాగంగానే కడపలో స్కిల్హబ్ ప్రారంభించామన్నారు. స్కిల్ డెవల్‌పమెంట్ చైర్మన కొండూరు అజయ్‌రెడ్డి, చల్లా మధుసూదనరెడ్డి, ఏపీ ఎస్ ఆర్టీసీ చైర్మన మల్లిఖార్జునరెడ్డి, మేయర్ సురే్‌షబాబు, జేసీ సాయికాంతవర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బీవీ రామకోటిరెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు,స్కిల్ డెవల్‌పమెంటు జనరల్ మేనేజరు బి.గోపినాఽథ్, జిల్లా ఉపాధి అధికారి దీప్తి పాల్గొన్నారు.