‘గోరంట్ల మాధవ్‌కు ఎంపీగా కొనసాగే అర్హత లేదు’

ABN , First Publish Date - 2022-08-05T04:50:44+05:30 IST

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఎంపీగా కొనసాగే అర్హత లేదని టీడీపీ ముస్లిం మైనార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు ఖాదర్‌బాషా ధ్వజమెత్తారు.

‘గోరంట్ల మాధవ్‌కు ఎంపీగా కొనసాగే అర్హత లేదు’

కమలాపురం రూరల్‌, ఆగస్టు 4 : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఎంపీగా కొనసాగే అర్హత లేదని టీడీపీ ముస్లిం మైనార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు ఖాదర్‌బాషా ధ్వజమెత్తారు. గురువారం తెలుగుదేశం పార్టీ  కార్యాలయంలో మండల అధ్యక్షుడు రాఘవరెడ్డితో కలిసి ఆయన విలేకరుతో మాట్లాడారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ చేసిన పనికిమాలిన పని మహిళలు సిగ్గుతో తలదించుకునేలా చేసిందన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఇంత నీచమైన పనికి దిగజారడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి జగనహనరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆయన్ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-05T04:50:44+05:30 IST