నేతన్నకు చేయూత ఇవ్వండి

ABN , First Publish Date - 2022-03-06T04:37:55+05:30 IST

చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ధరించడం వలన ఎండవేడిమి నుంచి ఉపశమనం కలగడంతో పాటు నేతన్నల జీవన స్థితిగతులను కాసింత మెరుగుపరచినవారమౌతామని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ తెలిపారు.

నేతన్నకు చేయూత ఇవ్వండి
చేనేత దుస్తులను పరిశీలిస్తున్న జేసీ సాయికాంత్‌వర్మ

చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభోత్సవంలో జేసీ సాయికాంత్‌వర్మ

కడప (మారుతీనగర్‌), మార్చి 5 : చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ధరించడం వలన ఎండవేడిమి నుంచి ఉపశమనం కలగడంతో పాటు నేతన్నల జీవన స్థితిగతులను కాసింత మెరుగుపరచినవారమౌతామని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ తెలిపారు. కేంద్రప్రభుత్వ సహకారంతో జిల్లా చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక నేక్‌నామ్‌ కళాక్షేత్రంలో ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాల అమ్మకాల ద్వారా చేనేత పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమన్నారు. కావున ప్రజలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపాలన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ ఆర్‌డీడీ రాజారావు, ఏడీ బ్రహ్మయ్య, సహాయ అభివృద్ధి అధికారి భీమయ్య, శేషగిరిరావు, ఆప్కో డీఎంవో జగదీశ్వరరావు, చేనేత ఐక్యవేదిక జాతీయ కన్వీనర్‌ అవ్వారు మల్లికార్జున, పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T04:37:55+05:30 IST