‘అన్నమయ్య’ కలెక్టర్‌గా గిరీష
ABN , First Publish Date - 2022-04-04T05:28:26+05:30 IST
అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా గిరీష నియమితులయ్యారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, తుడా వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
జాయింట్ కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా
నేడు బాధ్యతల స్వీకరణ
రాయచోటి, ఏప్రిల్ 3: అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా గిరీష నియమితులయ్యారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, తుడా వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయనను ఇక్కడి నుంచి బదిలీ చేసి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నియమించారు. సోమవారం ఉదయం ఈయన బాధ్యతలు స్వీకరిస్తారు.
జాయింట్ కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా
అన్నమయ్య జాయింట్ కలెక్టర్‌గా తమీమ్ అన్సారియాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2015 బ్యాచ్‌కు చెందిన ఈమె ప్రస్తుతం శ్రీశైలం స్పెషల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. తొలిసారిగా ఒక ముస్లిం మహిళను జాయింట్ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈమె సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
డీఆర్‌వోగా బాపిరెడ్డి
జిల్లా రెవెన్యూ అధికారిగా టి.బాపిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రస్తుతం సీఏడీఏ స్పెషల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఈయన సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారు.
రాయచోటి ఆర్డీవోగా రంగస్వామి
అన్నమయ్య జిల్లాలోని రాయచోటి రెవెన్యూ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆర్డీవోగా రంగస్వామిని నియమించింది. ఈయన ప్రస్తుతం కడప మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అదే విధంగా రాజంపేట ఆర్డీవోగా డి.కొండారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈయన చిత్తూరు జిల్లా అటవీ శాఖ ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్నారు.
జిల్లాకు మంచి పేరు తెచ్చేలా పని చేస్తాం
ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్‌రాజు
అన్నమయ్య జిల్లాకు మంచిపేరు తెచ్చేలా పనిచేద్దామని అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పోలీసులకు పిలుపునిచ్చారు. విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తూ అన్నమయ్య జిల్లాకు నూతన ఎస్పీగా బదిలీపై వచ్చిన ఆయన ఆదివారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా తొలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తనపైన నమ్మకాన్ని ఉంచి కొత్త జిల్లాకు తనను ఎస్పీగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తానని తెలిపారు. తొలుత జిల్లా పోలీసు కార్యాలయం వద్ద సాయుధ పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ తన కార్యాలయంలో పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా ఓఎ్‌సడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అన్బురాజన్ శుభాకాంక్షలు తెలిపారు. కడప ఏఎస్పీ మహే్‌షకుమార్, రాయచోటి, రాజంపేట, మదనపల్లెల డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అన్నమయ్య జిల్లాలోని డీఎస్పీలు, సీఐ, ఎస్‌ఐలతో ఆయన కాన్ఫరెన్స్‌లో హాల్‌లో సమావేశమయ్యారు. కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ శ్రీధర్, పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డి, రూరల్ సీఐ లింగప్ప, ఎస్‌ఐలు నరసింహారెడ్డి, మహమ్మద్‌రఫీ, ట్రాఫిక్ ఎస్‌ఐ రమే్‌షబాబు, అన్ని నియోజకవర్గాల నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.