చంద్రబాబుతో గంటా నరహరి భేటీ

ABN , First Publish Date - 2022-12-19T22:45:02+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జి గంటా నరహరి హైదరాబాదులో భేటీ అయ్యారు. చంద్రబాబునాయుడు పిలుపు మేరకు హైదరాబాదులోని ఆయన నివాసంలో సోమవారం కలిశారు.

చంద్రబాబుతో గంటా నరహరి భేటీ
నారా చంద్రబాబునాయుడుతో గంటా నరహరి

ఇదేం ఖర్మ కార్యక్రమాల విజయవంతం,

లోకేశ్‌ పాదయాత్రపై చర్చ

రాజంపేట, డిసెంబరు 19 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జి గంటా నరహరి హైదరాబాదులో భేటీ అయ్యారు. చంద్రబాబునాయుడు పిలుపు మేరకు హైదరాబాదులోని ఆయన నివాసంలో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని రాజంపేట, కోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల రాజకీయ వ్యవహారాలపై నరహరితో చంద్రబాబుతో చర్చించారు. నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిపై చర్చించారు. త్వరలో రాష్ట్రంలో నిర్వహించనున్న నారా లోకేశ్‌ పాదయాత్రపై మాట్లాడారు. ఇదేం ఖర్మ కార్యక్రమాలను రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో విస్తృత పరచాలని ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాలు జరిగేటట్లు నియోజకవర్గ ఇన్‌చార్జిలతో కలిసి నిర్వహించి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, అధికార పార్టీ అరాచకాలను గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - 2022-12-19T22:45:05+05:30 IST