గంగ ఒడికి గణపయ్య

ABN , First Publish Date - 2022-09-11T04:46:57+05:30 IST

మండల వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథులకు 11 రోజుల పాటు భక్తులు పూజలు నిర్వహించి శనివారం చివరిగా గణనాథుడిని గంగ ఒడికి చేర్చారు. గణపతి బప్పా మోరియా అంటూ వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. శెట్టిపల్లె గ్రామం అడవికమ్మపల్లె ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువులో నిమజ్జనం చేపట్టారు.

గంగ ఒడికి గణపయ్య
గాలివీడులో.. నిమజ్జనానికి తరలుతున్న గణనాథుడు

సంబేపల్లె, సెప్టెంబరు 10: మండల వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథులకు 11 రోజుల పాటు భక్తులు పూజలు నిర్వహించి శనివారం చివరిగా గణనాథుడిని గంగ ఒడికి చేర్చారు. గణపతి బప్పా మోరియా అంటూ వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. శెట్టిపల్లె గ్రామం అడవికమ్మపల్లె ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువులో నిమజ్జనం చేపట్టారు. 


గాలివీడులో: ఆయా గ్రామ పంచాయతీల్లో చెరువుల్లో గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గోరాన్‌చెరువు పంచాయతీలోని గణనాథుని లడ్డూ వేలంపాట రూ.లక్ష పలికినట్లు స్థానికులు తెలిపారు. 


లక్కిరెడ్డిపల్లెలో: మండలంలోని అనంతపురం ఈడిగపల్లెలో 11 రోజుల పాటు గణనాధునికి ఘనంగా పూజలు నిర్వహించి శనివారం అత్యంత వైభవంగా నిమజ్జనం నిర్వహించారు. నృత్యప్రదర్శన చేస్తూ యువకులు ఉత్సాహంతో గంగమ్మ జాతర సమీపంలో గల వంకలో నిమజ్జనం నిర్వహించారు. 


సిద్దవటంలో: మండల కేంద్రమైన సిద్దవటం దిగువపేట గాంధీ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని శనివారం పెన్నానదిలో నిమజ్జనం చేశారు. వినాయక ప్రతిమకు 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


సుండుపల్లెలో: మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలతో పాటు శనివారం వినాయకుని ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. 


వీరబల్లిలో: వీరబల్లి ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. 11 రోజులుగా పూజలు చేసి శుక్రవారం రాత్రి ఆర్కెస్ర్టా, శనివారం అన్నదానం ఏర్పాటు చేశారు. వినాయకుడి వద్ద ఏర్పాటు చేసిన లడ్డు రూ.71 వేలు పలికింది. ఓదివీడు మాతమ్మ ఆలయం వద్ద ఉంచి వినాయకుడిని తరలించారు.

Read more