యువజన సమస్యలపై భవిష్యత్‌ కార్యాచరణ

ABN , First Publish Date - 2022-12-16T23:49:57+05:30 IST

యువజన సమస్యల పరిష్కారాని కి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్లు డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ పేర్కొన్నారు.

యువజన సమస్యలపై భవిష్యత్‌ కార్యాచరణ

- వర్క్‌షాపులో డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌

కడప (సెవెన్‌రోడ్స్‌), డిసెంబరు 16:యువజన సమస్యల పరిష్కారాని కి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్లు డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ పేర్కొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎ్‌ఫఐ) ఆధ్వర్యంలో రాష్ట్ర వర్క్‌షాపు విజయవాడలోని వడ్డేశ్వరంలో జరగతున్నాయని, ఈ వర్క్‌షాపునకు కడప జిల్లా ప్రతినిధులుగా తనతోపాటు జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్‌రాజ్‌, జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్‌, లోకేంద్ర హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాళీ పోస్టులను ప్రభుత్వం సరైన పద్ధతిలో భర్తీ చేయడం లేదన్నారు. వర్క్‌షాపునకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారన్నారు.

Updated Date - 2022-12-16T23:50:00+05:30 IST