‘యార్డు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి’

ABN , First Publish Date - 2022-03-06T04:49:01+05:30 IST

మార్కెట్‌ యార్డు అభివృద్ధిపై కమిటీ సభ్యులు, అధికారులు దృష్టి పెట్టాలని రైల్వేకోడూరు ఎమ్మె ల్యే, ప్రభుత్వ వి ప్‌ కొరముట్ల శ్రీనివాసులు ఆదేశించారు.

‘యార్డు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి’
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ శ్రీనివాసులు

రైల్వేకోడూరు రూరల్‌, మార్చి 5: మార్కెట్‌ యార్డు అభివృద్ధిపై కమిటీ సభ్యులు, అధికారులు దృష్టి పెట్టాలని రైల్వేకోడూరు ఎమ్మె ల్యే, ప్రభుత్వ వి ప్‌ కొరముట్ల శ్రీనివాసులు ఆదేశించారు. సమాతా నగర్‌ వద్ద ఉన్న మార్కెట్‌ యార్డులో కమిటీ సభ్యులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ యార్డు ఆదాయ వనరులపై అఽధికారులు అన్వేషించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్‌ సాయి కిషోర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ సుభద్రమ్మ, జిల్లా కో ఆప్షన్‌ సభ్యు లు అన్వర్‌ బాష, ఉప సర్పంచ్‌ తోట శివసాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌ రెడ్డి, కమిటీ సభ్యులు దార్ల చంద్రశేఖ ర్‌, సుబ్బారెడ్డి, లక్ష్మయ్య, మస్తాన్‌ సరస్వతమ్మ, యజ్ఞం చంద్రశేఖర్‌,  యార్డు సెక్రెటరీ లక్ష్మికాంత్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T04:49:01+05:30 IST