చౌటపల్లె ఎద్దులకు మొదటి బహుమతి

ABN , First Publish Date - 2022-01-17T04:38:16+05:30 IST

రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీల్లో చౌటపల్లె ఎడ్లు మొదటి బహుమతి సాధించాయి.

చౌటపల్లె ఎద్దులకు మొదటి బహుమతి

చాపాడు, జనవరి 16: రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీల్లో చౌటపల్లె ఎడ్లు మొదటి బహుమతి సాధించాయి. వెదురూరు, నరహరిపురం, రాజుపాళెం గ్రామాల్లో 16న శుక్రవారం నుంచి మూడు రోజులు సంక్రాంతి ఉత్సవాలను చేసుకున్నారు. వెదురూరులోని సంగమేశ్వరస్వామి దేవాలయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాపాడు, మైదుకూరు, కమలాపురం తదితర ప్రాంతాల  భక్తులు, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మండలాధ్యక్షుడు లక్షుమయ్య దర్శనం చేసుకున్నారు.

రాజుపాళెంలో నిర్వహించిన చెక్కభజన, భరతనాట్యం ఆకట్టుకున్నాయి. నరహరిపురంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీల్లో ప్రొద్దుటూరు మండలం చౌటపల్లె వాసి మార్తల చంద్ర ఓబుళరెడ్డి ఎద్దులు 2,694 అడుగులు లాగి మొదటి బహుమతిగా రూ.1,10,000 గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రెండో బహుమతి కర్నూలు జిల్లా డోన్‌ మండలం కొత్తకోట వాసి డాక్టర్‌ గురునాథ్‌ ఎద్దులు 2,354 అడుగులతో రూ.75 వేలు, అనంతపురం జిల్లా యాడికి మండలం ఉప్పలపాడుకు చెందిన కులశేఖర్‌రెడ్డి ఎద్దులు 2,250 అడుగులతో మూడో బహుమతి గెలుచుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-01-17T04:38:16+05:30 IST