మొదటి విడత పరిహారం చెల్లించాలి : టీడీపీ

ABN , First Publish Date - 2022-12-15T23:09:10+05:30 IST

ప్రభుత్వం చెప్పిన విధంగా గండికోట నిర్వాసితులకు మొ దటి విడత 14 ముంపు గ్రామాలకు వెంటనే రూ.3.25లక్షల పరిహారం చెల్లించాలని మండల టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

మొదటి విడత పరిహారం చెల్లించాలి : టీడీపీ
కొండాపురం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

కొండాపురం, డిసెంబరు 15: ప్రభుత్వం చెప్పిన విధంగా గండికోట నిర్వాసితులకు మొ దటి విడత 14 ముంపు గ్రామాలకు వెంటనే రూ.3.25లక్షల పరిహారం చెల్లించాలని మండల టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రూ.10లక్షలు చెల్లిస్తామని చెప్పి మూడేళ్లు కావస్తు న్నా ఇంత వరకూ నిర్వాసితులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు టీడీపీ హయాంలో పునరావాస కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు త్వరితగతిన పూర్తిచేశారన్నారు. జగన్‌ ప్రభుత్వం ఏర్పడి 40నెలలు గడుస్తున్నా ఇంత వరకు పునరావాస కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్లు, డ్రైనేజీలు పూర్తి కాలేదన్నారు.

అర్హులై ఉండి కూడా పరిహారం అందక నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి వెంటనే పరిహారం అందించాలని కోరారు. గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన అన్ని ప్రభుత్వ కార్యాలయాలనూ ఇంత వరకూ పునర్నిర్మించలేదని, వాటికి పునాదిరా యి కూడా వేయలేదని విమర్శించారు. ముంపువాసుల సమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చి రోడ్లు, డ్రైనేజీలను నిర్మించిందని, ప్రస్తుత ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గండ్లూరు నాగేశ్వరరెడ్డి, టీడీపీ నేతలు గోరిశెట్టి బాబు, రమణారెడ్డి, నరసింహారెడ్డి, నాగిరెడ్డి, బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:09:12+05:30 IST