గ్యాస్‌ లీకై చెలరేగిన మంటలు : మహిళ మృతి

ABN , First Publish Date - 2022-03-06T04:31:58+05:30 IST

గ్యాస్‌ లీకై ఎర్రగొండ అంజలి (39) అనే మహిళ మృతి చెందినట్లు ఏఎ్‌సఐ నాగరాజు తెలిపారు.

గ్యాస్‌ లీకై చెలరేగిన మంటలు : మహిళ మృతి

సికెదిన్నె, మార్చి 5: గ్యాస్‌ లీకై ఎర్రగొండ అంజలి (39) అనే మహిళ మృతి చెందినట్లు ఏఎ్‌సఐ నాగరాజు తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు... చింతకొమ్మదిన్నె మండలం స్వామినగర్‌కు చెందిన అమ్మా టిఫెన్‌ సెంటర్‌ నిర్వాహకురాలు శనివారం ఉదయం టిఫిన్‌ చేసేందుకు గ్యాస్‌ ఆన్‌చేసి పొయ్యి ముట్టించగా మంటలు లేచి ఆమె తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం 108లో రిమ్స్‌కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు తెలిపారు. ఆమెకు భర్త, కొడుకు, కూతురు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-03-06T04:31:58+05:30 IST